అయోధ్యాలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకను నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన భోలా దాస్ దాఖలు చేశారు. రామమందిరంలో శ్రీరామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమంపై మతగురువు శంకరాచార్య అభ్యంతరాలను ఊటంకిస్తూ వేడుకను నిలిపివేయాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు.
జనవరి 2024లో మతపరమైన కార్యక్రమం నిర్వహించబోతున్నారు.. పుష్య మాసంలో ఎలాంటి మత పరమైన కార్యక్రమాలు నిర్వహించబడవు. ఆలయం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఏ దేవతా ప్రతిష్ట చేయకూడదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రాణ్ ప్రతిష్ట సనాతన సంపద్రాయానికి విరుద్దం అని.. అంతే కాదు బీజేపీ పార్టీ రాబోయే లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తోందని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.
జనవరి 22న రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆహ్వానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టపై శంకరాచార్యులు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని.. తాము హాజరు కాకపోవడానికి ముఖ్య కారణం ఇదేనని చెప్పారు.
రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టను రాజకీయం చేశారు.. సనాతన ధర్మానికి మార్గదర్శి అయిన శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదు.. మిగతా శంకరాచార్యులు కూడా హాజరకావడం లేదని చెప్పడం చర్చణీయాంశం అయిందని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు.
ఇదిలా ఉంటే .. రామమందిరం ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు హాజరు కాకపోవడంపై జరుగుతున్న ఆందోళనలపై పూరీ శంకరాచార్యులు నిశ్చలానంద స్వామి మహరాజ్ ఇలా స్పందించారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతునివ్వడం.. లేదా వ్యతిరేకించడం లేదని.. ఈ విషయంలో దురాశ, భావోద్వేగాలకు తావు లేకుండా వారి నిష్పాక్షిక వైఖరిపైనే నిర్ణయాలు ఉంటాయని స్వామి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ స్పష్టం చేశారు.