యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ల ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి ఉదయం నుండే బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. ప్రసాదం కౌంటర్ లో కూడా  భక్తులు కెక్కిరిసిపోయారు.