దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రద్దీ దృష్ట్యా వాహనాలు కొండపైకి వెళ్లకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ALSO READ : రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
వాహనాలు కొండపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటుండటంతో 108 వాహన సిబ్బంది కొత్త మర్గాన్ని ఎంచుకున్నారు. దొంగచాటుగా భక్తులను 108 వాహనాల్లో కొండపైకి చేరుస్తున్నారు. అందు గానూ టికెట్ల రుపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో తనిఖీ చేయగా.. ఖంగుతినడం వారి వంతైంది. కొండపైకి భక్తులను తరలిస్తున్న 108 వాహనం డ్రైవర్ ,సిబ్బందిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను కిందకు దించి వాహనాన్ని వెనక్కి పంపించేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. దొంగచాటుగా 108 వాహనాల్లో భక్తుల తరలింపు#Vijayawada #AndhraPradesh pic.twitter.com/AoZhL6OEFn
— Govardhan Reddy (@SportsNewsInd24) October 12, 2024