
ఢిల్లీలో మత్తు పానీయాలు,డ్రగ్స్ నిషేధించాలని.. లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ప్రింట్ చేయడం సాధ్యపడదని లాయర్ అశ్విన్ కుమార్ ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ జూలై 4కు వాయిదా వేసింది.
మరిన్ని వార్తల కోసం..