కరోనా తరువాత జనాలు చాలా మంది పరిశుభ్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం.. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం.. కరోనా ముందు కంటే..కరోనా తరువాత చాలా బెటర్. ఇదంతా బాగానే ఉంది. కాని బెడ్ రూంలో ఉపయోగించే దిండ్లు.. బెడ్ షీట్ల విషయంలో అలసత్వం వహిస్తున్నారు. బెడ్ రూం .. ఆరోగ్య విషయంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అసలు పిల్లోస్ ను... పిల్లో కవర్స్ ను.. బెడ్ షీట్లను ఎన్ని రోజులకొకసారి కి మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
బెడ్ రూంలో అందరూ దాదాపు పిల్లోస్ ఉనయోగిస్తారు. బెడ్ షీట్లు శుభ్రంగా లేకపోతే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినా అలాంటి వాటిని మనం పట్టించుకోమనుకోండి. పిల్లో కవర్స్ ను... బెడ్ షీట్లను తరచూ మార్చాలి. దిండ్లను కొన్ని రోజుల తరువాత వాటి స్థానంలో కొత్తవి ఉపయోగించాలి. ఎందుకంటే కొన్ని రోజులకు వాటి ఆకారాన్ని కోల్పోతాయి. అలాంటివి పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. మార్చకుండా అలానే వాడితే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చర్మవ్యాధుల నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం...నిద్రపోయే సమయంలో మైట్స్, ఆయిల్, మృత చర్మ కణాలు పిల్లోస్ పై... బెడ్ షీట్లపై పడతాయి. ఇవి దిండులో చేరి దుమ్ముగా ఏర్పడుతుంది. వీటిని మార్చకుండా అలానే ఉంచితే గజ్జి, తామర లాంటి చర్మ సంబంధమైన అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దిండ్లు సనైన షేప్ లో లేకపోతే వెన్నెముక.. మెడ ప్రాంతాల్లో అనేక సమస్యలు వస్తాయి. అందుకోసమని రెండేళ్లకొక సారి దిండ్లను కచ్చితంగా మార్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.వీటిని రెండేళ్లు వాడినా.. వారానికొసారి వాష్ చేయాలి.
ALSO READ : చలి జ్వరాలు వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ పరీక్షలు చేయించుకోండి.. బీ అలర్ట్..!
ఒకవేళ అంతకంటే ముందే దిండు గట్టి పడినా.. ప్లాట్ గా మారినా.. రంగు మారినట్టు గుర్తించినా ..వెంటనే మార్చాలి. ఒక పిల్లో కవర్స్ ను, బెడ్ షీట్లను వారానికొకసారి వాష్ చేయాలి. వాష్ చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించాలి. ఇకదిండ్లను మార్చేటప్పుడు పాత వాటిని చెత్తలో పడేయవద్దు. వాటిని ఆశ్రమాలకు కాని... జంతుశాలలకు కాని ఇవ్వడంది. సింథటిక్ తో తయారు చేసిన పిల్లోస్ ను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కాటన్ తో తయారు చేసినవి సహజంగానే డీ కంపోజ్ అవుతాయి.