కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దు : రేగా కాంతారావు

గుండాల,  వెలుగు : కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మొద్దని పినపాక బీఆర్​ఎస్​ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.  శుక్రవారం ఆళ్లపల్లి మండలంలో ముమ్మురంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణను సీఎం కేసీఆర్​అభివృద్ధి చేశారన్నారు. ఇప్పటికే గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మరోసారి బీఆర్​ఎస్​ను గెలిపిస్తే మిగతా పనులు కూడా పూర్తిచేస్తామని చెప్పారు.

పినపాక నియోజకవర్గానికి లక్షల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. అనంతరం ఆళ్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరాయి. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ సీనియర్ నాయకుడు భవాని శంకర్, ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మండల అధ్యక్షులు పాయం, నరసింహారావు, కోఆపరేటివ్ చైర్మన్ గోగ్గేల రామయ్య తదితరులు పాల్గొన్నారు.