క్రీడలతో బంగారు భవిష్యత్ : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

క్రీడలతో బంగారు భవిష్యత్ : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల, వెలుగు : క్రీడలతో బంగారు భవిష్యత్​లభిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సంక్రాంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు ధార అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ క్రీడల్లో గెలుపొందిన వారికి శనివారం బహుమతులు అందజేశారు. అనంతరం మండలంలోని కాచనపల్లిలో రూ.20 లక్షలతో మూడు సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పలు గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభించారు. తహసీల్దార్ ఆఫీస్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీవో సత్యనారాయణ, సీఐ రవీందర్, ఎస్సై రాజమౌళి, బానోత్​ రాంబాబు,  వివిధ శాఖల ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ముత్యమాచారి, ఎస్ కే ఖదీర్ పాల్గొన్నారు.

ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి 

ఆళ్లపల్లి : ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్మాణ లక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు.

మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.శ్రీను, తహసీల్దార్ శకుంతల, ఏవో అనిల్, ప్రభుత్వ వైద్యాధికారి కేవీ సంఘమిత్ర, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాయం రామనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.