పినపాక తహసీల్దార్​ సస్పెన్షన్

పినపాక తహసీల్దార్​ సస్పెన్షన్

పినపాక, వెలుగు: ఏజెన్సీ యాక్ట్ ను అతిక్రమించి తహసీల్దార్ సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం రెవెన్యూ గ్రామ సర్వే నం. 17/ఏఏ లో 30 కుంటలు, సర్వే నం.18లో ఎకరం భూమికి తలెత్తిన వివాదంపై కలెక్టర్ కోర్టులో గిరిజనేతరులు మధ్య కేసు నడుస్తోంది. పినపాక తహసీల్దార్ తోట సూర్యనారాయణ ఏజెన్సీ యాక్ట్​–1959, 1/70కు విరుద్ధంగా గిరిజనేతరుడైన పట్టాదారు భూమిని వేరొకరికి పార్టిషన్​చేశారని అందిన ఫిర్యాదుతో   భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరు జితేశ్​వి పాటిల్​ఎంక్వైరీ చేయించారు. 

 తహసీల్దార్​రూల్స్ అతిక్రమించారని తేలింది. దీంతో మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్​ చేస్తూ  కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పినపాక తహసీల్దారుగా వచ్చినప్పటి నుంచి సత్యనారాయణ పరిష్కరించిన ఫైళ్లను మొత్తం పరిశీలన చేయాలని పలు గిరిజన సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.