థియేటర్స్లో భయపెట్టిన పిండం OTTకి వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్స్లో భయపెట్టిన పిండం OTTకి వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ హీరో హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ పిండం.  దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తోనే ఆడియన్స్ ను భయపెట్టిన ఈ సినిమా డిసెంబర్ 15న థియేటర్స్ లోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీ ఆడియన్స్ ను భయపెట్టడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ఈ మూవీ. అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. 

ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న పిండం మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్దమయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఆడియన్స్ కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న పిండం మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.