పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్​గా శ్రీపాల్ రెడ్డి

పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్​గా శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) స్టేట్ ప్రెసిడెంట్​గా పింగిలి శ్రీపాల్ రెడ్డి, జనరల్ సెక్రట రీగా పుల్గం దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు.  హైదరాబాద్​లో రెండ్రోజులుగా జరుగుతున్న పీఆర్టీయూ 35వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పోస్టులకు 4 నామినేషన్లు వచ్చినా, యూనియన్ పెద్దల జోక్యంతో వారు ఉపసంహరించుకున్నారు.

దీంతో రాష్ట్ర, ప్రధాన కార్యదర్శులుగా శ్రీపాల్ రెడ్డి, దామో దర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడు తూ.. రెండేండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న సరెం డర్ లీవ్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగలోపు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోతే ఉద్యమ కార్యాచరణ చేపతామని హెచ్చరించారు. పెండింగ్​లో ఉన్న 5 డీఏలను దసరా కాను కగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్ రెడ్డి, పూల రవీం దర్,  సంఘం రాష్ట్ర నాయకులు పేరి వెంకట్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, చెన్నకేశవరెడ్డి, గుండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.