జాతీయ జెండా పోల్కు పింక్ కలర్

గణతంత్ర దినోత్సవ వేడుకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే జెండా ఎగురవేసే పోల్కు పింక్ కలర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోల్ కు వైట్ కలర్తో పాటు గ్రీన్, ఆరెంజ్ కలర్ వేయాలని ఫ్లాగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ లో ఉంది. ఏలాంటి గైడ్ లైన్స్ పాటించకుండా పోల్కు పింక్ కలర్ను ఉంచడం పట్ల  కొందరు జాతీయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారికి జాతీయ జెండా గైడ్ లైన్స్ తెలియవా అంటూ విమర్శిస్తున్నారు.