రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగులకు గండం

రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. సాఫ్ట్​గా మెయిల్​ రూపంలో పింక్​స్లిప్స్​ను పంపుతున్న కంపెనీలు..  రకరకాల కారణాలతో ఎంప్లాయీస్​ను వదిలించుకునే పనిలో పడ్డాయి. నవంబర్​ నుంచే ఇది స్టార్టయింది. వచ్చే ఏడాది ఏప్రిల్​ వరకు సుమారు 17 శాతం మందిని కంపెనీలు తొలగించే అవకాశం ఉందని ఐటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ నుంచి ఏదైనా మెయిల్​ వస్తే.. దాన్ని ఓపెన్​ చేయాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1,250 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో సుమారు ఆరు లక్షల మంది పని చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తయి ఖాళీగా ఉన్నవాళ్లు, కొత్త టెక్నాలజీకి అప్‌‌డేట్‌‌ కాని వాళ్లు, ఎక్కువ మొత్తాల్లో జీతాలు తీసుకుంటున్నవాళ్లు.. ఇలా దాదాపు లక్ష మంది ఎంప్లాయీస్​ని  జాబ్స్​ నుంచి తీసేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యంతో పెద్దగా  ప్రాజెక్టులు రావడం లేదని, వచ్చిన ప్రాజెక్టుల వల్ల కూడా లాభం ఉండటం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్​ను కొనసాగించడం భారంగా మారుతోందని కంపెనీలు అంటున్నాయి.

ఫోర్త్​ రేటింగ్.. 60 రోజుల టైమ్​

– సందీప్ మక్తాల , గ్లోబల్ ప్రెసిడెంట్, టిటా

పనితీరు బాలేదని ముద్రేస్తున్నరు

పనితీరు బాగా లేదనే ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటున్నారు. ఒక రకంగా ఇన్‌‌సెక్యూరిటీ క్రియేట్‌‌ చేస్తున్నారు. తొలగించకుండా వేరే టీంలోకి పంపాలని, వేరే పని అప్పచెప్పాలని కోరుతున్నాం. జాబ్ పోతే కుటుంబం డిస్టర్బ్‌‌ అవుతుందని చాలా మంది ఎంప్లాయీస్​ ఆందోళన చెందుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న కొత్త కోర్సుల పై అవగాహన పెంచుకోవాలి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సులకు అధికంగా డిమాండ్  ఉంది. అంతే కాకుండా ఉద్యోగులు పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్ లకు వెళ్లాలి. దీంతో కొంత మనోధైర్యం వస్తుంది.- సౌమ్య, ఐటీ ఎంప్లాయ్

హైదరాబాద్, వెలుగు:

సాఫ్ట్ వేర్ జాబ్.. బీటెక్, బీసీఏ, ఎంసీఏ పూర్తయిన ప్రతి ఒక్కరి కల. ప్రారంభంలోనే ఐదంకెల వేతనం.. వీకెండ్ సెలవులు, బోనస్‌‌‌‌‌‌‌‌లు, తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే పదోన్నతులు, అప్పుడప్పుడు ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉద్యోగంలో బోలెడు ఆకర్షణలు. అయితే ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే.. భద్రత లేని ఉద్యోగం, ప్రతి నెల మారే షిఫ్ట్ లు, ఎప్పటికప్పుడు లక్షలు పెట్టి స్కిల్స్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు ఉన్నన్ని రోజులు ఆకాశానికి ఎత్తే కంపెనీలు.. ప్రాజెక్టులు పూర్తి కాగానే ఎంప్లాయీస్​ను వదిలించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తీసివేత ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పింక్​స్లిప్స్​ పంపుతున్న కంపెనీలు.. వరుసగా ఎంప్లాయీస్​ను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. దీన్ని రాష్ట్రంలో సుమారు లక్ష మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులు పూర్తయిపోయాయని, పనితీరు బాగోలేదని, ఆర్థిక మాంద్యం ఉందని, ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని.. వంటి పలు కారణాలతో ఎంప్లాయీస్​ను కంపెనీలు ఇంటికి పంపే పనిలో పడినట్లు ఐటీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.  దీంతో ఎంప్లాయీస్​ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పింక్​ స్లిప్​ వస్తే చాలు..

రాష్ట్రంలో 1,250 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీల్లో పెద్దమొత్తం హైదరాబాద్​లోనే ఉన్నాయి. ఏటా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉద్యోగుల పెర్ఫార్మెమెన్స్​ను కంపెనీలు లెక్కకడుతూ 4వ రేటింగ్ ఇస్తుంటాయి. ఈ రేటింగ్ ఇచ్చిన తర్వాత 45 నుంచి 60 రోజుల గడువును ఎంప్లాయీస్​కు ఇస్తారు. ఈ సమయంలోగా పనితీరు మార్చుకోవాలని, లేకపోతే  జాబ్ ఉండదని మెయిల్స్ పంపుతుంటారు.  వాటిని ఐటీ వర్గాలు పింక్​స్లిప్స్​గా పిలుస్తుంటాయి. ఇలాంటి మెయిల్‌‌‌‌‌‌‌‌ వచ్చిందంటే దాదాపుగా ఉద్యోగం పోయినట్లేనని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కువ శాలరీ ఉంటే.. జాబ్​ గల్లంతే!

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో కంపెనీలు ముందుగా ఎక్కువ మొత్తంలో శాలరీ ఉన్న వాళ్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు తీసుకునే ఉద్యోగులకు పింక్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌లు పంపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ల స్థానంలో తక్కువ ప్యాకేజీ ఇస్తూ కొత్త వారిని తీసుకోవాలని భావిస్తున్నాయి.

ప్రాజెక్టులు లేవని, ఆర్థిక మాంద్యం ఉందని..

చాలా కంపెనీలు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇక చేయడానికి పనిలేదని చెబుతూ ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో పడ్డట్లు సమాచారం. కొన్ని కంపెనీలైతే ‘మీ పని తీరు మెరుగుపరుచుకోండి’ అంటూ మెయిల్స్​ పంపుతున్నాయి. దాని అర్థం పనితీరు బాగోలేదని చెప్పి.. ఇంటికి పంపడమేనని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. కొత్తగా ప్రాజెక్టులు రావడం లేదని, వచ్చినా వాటి వల్ల లాభాలు రావడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్​ ఉందని, దీని వల్ల తాము ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితిలో ఎంప్లాయీస్​ను కొనసాగించడం తమకు భారమవుతుందని అంటున్నాయి.

17 శాతం మందికి ఎఫెక్ట్​

నవంబర్​ నుంచి ఎంప్లాయీస్​కు మెయిల్ రూపంలో పింక్​ స్లిప్స్ వెళ్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్​ వరకు రాష్ట్రంలో 17శాతం మంది ఐటీ ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందని ఐటీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఆరులక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, 17శాతం అంటే.. లక్ష మందిని ఉద్యోగాల నుంచి తీసేసే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి.

కార్మిక శాఖకు భారీగా ఫిర్యాదులు

కొంత కాలం క్రితం ఓ ప్రముఖ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తే  వాళ్లు కార్మిక శాఖను ఆశ్రయించారు. దీంతో సాఫ్ట్ వేర్ అసోసియేషన్ జోక్యం చేసుకొని.. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, ఉద్యోగులకు ఆరు నెలల వేతనం ఇవ్వాలని ప్రతిపాదించింది. దానికి సదరు కంపెనీ అంగీకరించి ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసిందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం కార్మిక శాఖను పింక్​స్లిప్స్​ ఉద్యోగులు ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తమను ఉద్యోగాల నుంచి తొలగించే పనిలో భాగంగానే  కంపెనీలు పింక్​ స్లిప్స్​ను పంపుతున్నాయని, భద్రత కల్పించాలని కోరుతున్నాయి.

బెంచ్​ ప్రాసెస్​కు స్వస్తి!

సాఫ్ట్ వేర్ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులుస్తుంటాయి. కొత్త టెక్నాలజీ వస్తుంటుంది. దానికి తగ్గట్టుగా ఉద్యోగులు అప్​గ్రేడ్​ కావాలని కంపెనీలు అంటున్నాయి. అలా అప్​గ్రేడ్​ కాని వాళ్లను కొనసాగించడం కష్టమని చెబుతున్నాయి. అయితే ఈ కోర్సులను బయట కోచింగ్ సెంటర్లలో నేర్చుకోవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ప్రాజెక్టు స్టార్ట్ కాకముందే ఉద్యోగులను రిక్రూట్ చేసుకొని కంపెనీలు ట్రైనింగ్ ఇచ్చి సిద్ధంగా ఉంచేవి. దీన్ని బెంచ్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఈ బెంచ్ ప్రాసెస్ కు కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయి. కాస్ట్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌ పేరిట చాలా కంపెనీలు ట్రైనింగ్​లు ఇవ్వడం మానేసినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రాజెక్టులు రాకపోతే ఉద్యోగులపై ట్రైనింగ్​కు పెట్టిన ఖర్చు వృథా అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

టాస్క్​ ద్వారా ట్రైనింగ్​ ఇప్పించాలి

బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన స్టూడెంట్స్​కు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ సంస్థ ద్వారా పలు అంశాల్లో శిక్షణను ఇస్తోంది. దీంతో క్యాంపస్ ప్లేస్ మెంట్లు, ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. అయితే పనితీరు పేరుతో తొలగించిన వారికి సైతం టాస్క్ ద్వారా శిక్షణ ఇవ్వాలని సాఫ్ట్ వేర్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌‌‌‌‌ కోర్సుల్లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని అడుగుతున్నాయి. దీని వల్ల బయట కోచింగ్ సెంటర్లలో లక్షల ఫీజులను చెల్లించే ఇబ్బంది తప్పుతుందంటున్నారు.

కాస్ట్ కటింగ్ పేరుతో..

గతంలో పెద్ద సాఫ్ట్​వేర్ కంపెనీలు ప్రాజెక్టులు వస్తాయన్న ఉద్దేశంతో వేలమందిని ముందుగానే రిక్రూట్ చేసుకునేవి. ఇప్పుడు అలా చేయటం లేదు. ప్రాజెక్టుకు సంబంధించి స్కిల్స్ లేకపోతే ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఇందుకు కాస్ట్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కారణం. పదేండ్ల అనుభవం ఉన్న వారికి ఏడాదికి రూ. 20 లక్షల వేతనం ఉంటుంది. వీరిని తొలగించి తక్కువ జీతానికి ఫ్రెషర్స్​ను తీసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు ప్రాజెక్టులు వచ్చినప్పుడే  ఉద్యోగులను తీసుకుంటున్నాయి.

– రామకృష్ణ, సీనియర్ రిక్రూటర్

బోనస్ ఇవ్వాల్సి వస్తుందనీ..

పని తీరు బాగా లేదనో, ప్రవర్తనలో లోపం ఉందన్న కారణాలతో తొలగిస్తుంటారు. కొన్ని సార్లు ఎక్స్ పీరియన్స్ లెటర్ కూడా ఇవ్వడం లేదు. పింక్​ స్లిప్స్​ రాగానే చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళన.. కుటుంబం ఏమౌతుందోనన్న కలవరం వారిని కుంగదీస్తోంది. లోన్లు కట్టేందుకు కొందరు తక్కువ జీతానికి పనిచేస్తున్నరు జనవరిలో బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొన్ని కంపెనీలు తీసివేతలకు దిగుతున్నాయి.

– ఓ ప్రధాన కంపెనీకి చెందిన టీమ్ లీడర్

ప్రభుత్వం శిక్షణ ఇప్పించాలి

ప్రాజెక్టులకు సరిపడా స్కిల్స్ లేవనే సాకుతో  కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవాలంటే లక్షల ఫీజులు ఉన్నాయి. జాబ్‌‌ పోయిన వారికి ప్రభుత్వం టాస్క్ ద్వారా శిక్షణ ఇప్పించాలి.

– వినయ్ కుమార్ దాసరి, ఐటీ ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌

పనితీరును బట్టి తొలగింపు

నేరుగా ఉద్యోగులను తీసేయలేక పర్ఫామెన్స్​ అప్రైజల్ పేరుతో తొలగిస్తున్నాయి. రిక్రూట్ చేసుకొని, ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో చేర్చుకునే వరకు ఒక్కో ఉద్యోగికి లక్షన్నర వరకు ఖర్చు చేస్తోంది. కొన్నిసార్లు మెరుగు పర్చుకునేందుకు టైమ్ ఇచ్చి ఆలోగా మార్పు రాకపోతే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.- అజీజ్ హుస్సేన్ , ఐటీ ఉద్యోగి