స్కూల్ విద్యార్థుల‌కు గులాబీ రంగు యూనిఫామ్

స్కూల్ విద్యార్థుల‌కు గులాబీ రంగు యూనిఫామ్

విద్యార్థుల యూనిఫామ్ క‌ల‌ర్ మార్చ‌నున్న‌ట్లు తెలిపింది ఏపీ విద్యాశాఖ‌. వ‌చ్చే ఏడాది నుంచి ప్ర‌భుత్వ స్కూల్స్ లో చ‌దివే 6 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల యూనిఫామ్ క‌ల‌ర్ మార‌నున్న‌ట్లు చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు తెలుపు, నీలం, ముదురు నీలం రంగులు ఇస్తుండ‌గా ఈ సారి గులాబీ రంగు దుస్తులు ఇవ్వ‌నున్నామ‌ని తెలిపింది. బాయ్స్ కు ప్యాంట్, ష‌ర్ట్..బాలిక‌ల‌కు పంజాబీ డ్రెస్ ఇవ్వనున్నామ‌ని..వ‌స్త్రాల‌ను తామే పంపిణీ చేస్తామ‌ని తెలిపింది.