అరెస్ట్​ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్​ను​ అరెస్ట్​ చేశారు: కేటీఆర్​

అరెస్ట్​ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్​ను​ అరెస్ట్​ చేశారు: కేటీఆర్​
  • హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్​నూ అరెస్ట్​ చేయాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్​ అన్యాయమని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్​ హీరోను అరెస్ట్​చేయడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని విమర్శించారు.  ప్రభుత్వాన్ని తప్పుపడుతూ శుక్రవారం ప్రకటనలు విడుదల చేశారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందని.. కానీ, అసలు తప్పు ఎవరిదని ప్రశ్నించారు.

ఈ అంశంలో అల్లు అర్జున్ అరెస్ట్ న్యాయమైతే.. హైడ్రా పేరుతో పేద ప్రజలను భయపెట్టి, వారి మరణానికి కారణమైన సీఎం రేవంత్​ రెడ్డిపైనా కేసులు పెట్టి అరెస్ట్​ చేయాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు.