ఏపీలో ఎన్నికల తర్వాత పెనుదుమారం రేపిన పల్నాడు అల్లర్ల వేడి ఇంకా చల్లారలేదు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ అక్కడ 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు వైసీపీ, టీడీపీ నాయకులకు గృహ నిర్బంధం విధించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు తమ గన్మెన్లను వదిలేసి వెళ్లారని తెలుస్తోంది.
ఈ మేరకు పిన్నెల్లి సోదరుల గన్మెన్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా పిన్నెల్లి బ్రదర్స్ విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి, ఘటన ఇంకెన్ని ట్విస్టులకు దారి తీస్తుందో, ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.