వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జిల్లా కోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నెల 18న పిన్నెల్లికి సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది . దీంతో జిల్లా కోర్టులో పిన్నెల్లి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పాల్వాయిగేటులో టీడీపీ ఏజెంట్‌పై దాడి, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మరోసారి రెండు కేసుల్లోనూ జిల్లా న్యాయస్థానం పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది.
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో కారంపూడిలో చెలరేగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉంటున్నారు. కారంపూడి సీఐపై దాడి, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలని ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.