ఈవీఎం ధ్వంసం కేసు: హైకోర్టులో విచారణ, ముగియనున్న పిన్నెల్లి బెయిల్

ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలో కేసు నమోదయ్యింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న పిన్నెల్లికి నేటితో గడువు ముగియనుంది. ఈ క్రమంలో హైకోర్టులో ఈవీఎం ధ్వంసం కేసుపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో పిన్నెల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. అంతే కాకుండా ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడతారా అంటూ పిన్నెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.