ఒలింపిక్స్​ ​సంఘం జనరల్​ సెక్రటరీగా రాఘునాథ్​రెడ్డి

ఒలింపిక్స్​ ​సంఘం జనరల్​ సెక్రటరీగా రాఘునాథ్​రెడ్డి
  • ఏకగ్రీవంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా కొత్త కమిటీ ఎన్నిక 

కోల్​బెల్ట్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఒలింపిక్స్​ అసోసియేషన్ కొత్త​జనరల్​ సెక్రటరీగా మంచిర్యాల జిల్లాకు చెందిన పిన్నింటి రాఘునాథ్​రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మంచిర్యాల జడ్పీ బాయ్స్​ హైస్కూల్​లో ఒలింపిక్స్​అసోసియేషన్​జనరల్​బాడీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-–2028కి గానూ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

రాష్ట్ర ఒలంపిక్స్​​అసోసియేషన్ ​వైస్ ​ప్రెసిడెంట్​ మాల్లారెడ్డి, ఉమ్మడి జిల్లా క్రీడా ప్రాదిక సంస్థ బాధ్యులు రాజేశ్​ అబ్జర్వర్​గా, ఎలక్షన్​ అధికారిగా అడ్వకేట్​ నిమ్మతి శ్రీనివాస్​ వ్యవహరించి ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఒలింపిక్స్​​ అసోసియేషన్ బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్​ సెక్రటరీగా రాఘునాథ్​ రెడ్డిని రెండోసారి ఎంపిక చేశారు. చీఫ్​ పాట్రన్​గా మాజీ మంత్రి డాక్టర్​ఎస్.వేణుగోపాలచారి, చైర్మన్​గా​కె.పార్థసారథి, ప్రెసిడెంట్​గా బి.గోవర్ధన్​రెడ్డి, వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఆర్.నారాయణరెడ్డి, ట్రెజరర్​గా​ కనపర్తి రమేశ్, వైస్​ప్రెసిడెంట్లుగా ఇ.రాంచందర్, ఎన్.శ్రీధర్​రెడ్డి, యు.చంద్రమోహన్​గౌడ్

 ఎం.శ్రీనివాస్, కె.చంద్రయ్య, జాయింట్ ​సెక్రటరీలుగా సుకుమార ఫ్రాన్సిస్, పి.సుధాకర్, బి.రమేశ్, కె.శేఖర్, కె.పాండునాయక్​, కె.శ్రీనివాస్ రాజు, ఎగ్జిక్యూటివ్ ​కమిటీ మెంబర్లుగా కట్ట ఈశ్వరచారీ, ఆర్.శ్రీనివాస్​రెడ్డి, ఇ.మారయ్య, ఎల్.శరత్ బాబు, బి.శ్రీనివాస్ గౌడ్, డి.దేవేందర్, ఎన్.హరిచరణ్, భూమన్న, మహేందర్ సింగ్, చీఫ్ అడ్వైజర్​గా కంబగోని సుదర్శన్ గౌడ్, అడ్వైజర్లుగా బి.బాబురావు, పరిమళ, లీగల్ అడ్వైజర్లుగా చిట్ల రమేశ్, నిమ్మతి శ్రీనివాస్, టెక్నికల్ అడ్వైజర్​గా ఎండీ నజీర్​ను 
ఎన్నుకున్నారు.