భారత్‌‌లో ఇన్- కార్ ఉత్పత్తుల తయారీ.. ప్రకటించిన పయనీర్

భారత్‌‌లో ఇన్- కార్ ఉత్పత్తుల తయారీ.. ప్రకటించిన పయనీర్

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ సౌండ్​ సొల్యూషన్స్​ కంపెనీ పయనీర్ కార్పొరేషన్ వచ్చే ఏడాది మనదేశంలో ఇన్-–కార్ ఉత్పత్తుల తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ 2023లోనే ఇక్కడ  ఆర్ అండ్ డీ సెంటర్​ను తెరిచింది.   

స్థానిక ఆటో కంపెనీల కోసం మొదట డిస్‌ప్లే  ఆడియో ప్రొడక్టులను అందిస్తుంది. తదనంతరం ఫ్యాక్టరీ ఇన్​స్టలేషన్స్, రిటైల్​ మార్కెట్​​కోసం ఇన్​–కార్ ​ప్రొడక్టులను తయారు చేస్తుంది.   పయనీర్​ ఇండియా వెహికల్స్​కోసం స్పీకర్లు, ఆంప్లిఫయర్లు, కార్​ ఆడియో–వీడియో సొల్యూషన్స్​ అందిస్తుంది.