
ములుగు జిల్లా తుపాకులగూడెం నుంచి ధర్మసాగర్ మీదుగా గండిరామారానికి నీటిని తరలించేందుకు ఫేజ్–2లో భాగంగా పైప్లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్లైన్ హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల శివారులోని దేవాదుల గేట్వాల్వ్ శుక్రవారం లీకైంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీరు చాలా ఎత్తుకు ఎగిసిపడింది. సాయంత్రం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నీరంతా రోడ్డుపాలైంది. – ధర్మసాగర్(వేలేరు), వెలుగు