రూ.1,750 కోట్ల పిరమల్‌‌‌‌ బై బ్యాక్‌‌‌‌..షేరుకి రూ.1,250 చెల్లించేందుకు ఓకే..

 రూ.1,750 కోట్ల పిరమల్‌‌‌‌ బై బ్యాక్‌‌‌‌..షేరుకి రూ.1,250  చెల్లించేందుకు ఓకే..

న్యూఢిల్లీ: పిరమల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ రూ.1,750 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్  స్కీమ్‌‌‌‌ను ప్రకటించింది. షేరుకు రూ.1,250 చెల్లించడానికి ముందుకొచ్చింది.  కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌లో 2 శాతం తగ్గి రూ.1,073 దగ్గర క్లోజయ్యాయి.  ఫేస్ వాల్యూ రూ.2 ఉన్న ఒక కోటి నలభై లక్షల ఈక్విటీ షేర్లను బై బ్యాక్ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని పిరమల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ ఎక్స్చేంజి ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఇది కంపెనీలో 5.87 శాతం వాటాకు సమానం. ఈ షేర్ల బైబ్యాక్ స్కీమ్‌‌‌‌కు ఆగస్టు 25 రికార్డ్‌‌‌‌ డేట్‌‌‌‌గా నిర్ణయించారు.  అంటే ఈ తేది నాటికి షేర్ హోల్డర్లుగా నమోదైన వారు షేర్ల బై బ్యాక్ స్కీమ్‌‌‌‌లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. 

ప్రమోటర్‌‌‌‌‌‌‌‌, ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఈ ఇష్యూలో భాగం పంచుకోవడం లేదు. మొత్తం ఐదు వర్కింగ్ డేస్ పాటు   ఈ షేర్ల బైబ్యాక్ టెండర్ ప్రాసెస్ కొనసాగుతుంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో బయటపెడతామని కంపెనీ పేర్కొంది. కాగా,ఈ నెల 21 నాటికి పిరమల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌లో ప్రమోటర్ల వాటా 43.48 శాతంగా ఉంది. డొమెస్టిక్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (డీఐఐ) కు 13.55 శాతం, ఫారిన్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌ఐఐ) కు 25.74 శాతం వాటా ఉంది. పబ్లిక్‌‌‌‌, కార్పొరేట్స్, ఇతరుల దగ్గర మరో 17.23 శాత వాటా ఉంది. కాగా, బై బ్యాక్ అంటే ఓపెన్ మార్కెట్ నుంచి కంపెనీ షేర్లను తిరిగి కంపెనీనే కొనుగోలు చేయడం.