
- కమిషనర్, వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ మేయర్ అత్యవసర మీటింగ్
మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ మేయర్ బ్యాంకాక్ లో క్యాంపులో ఉండగా.. ఆఫీసుకు అధికారులు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ అని వెళ్లిపోతుండగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు పనులు కావడంలేదు. దీంతో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల అధికారులు అప్రమత్తత, సమన్వయంతో ఉండాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో కమిషనర్ త్రిలేశ్వరితో కలిసి కార్పొరేటర్లు, మున్సిపల్, విద్యుత్, జలమండలి, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.