
- పూర్వాభాద్ర 4వ పాదము; ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు; రేవతి 1, 2, 3, 4 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం ది, దు, శ్యం, ఝా, ధా, దే, ధో, ఛా, చి
- ఆదాయం : 5
- రాజపూజ్యం : 3
- వ్యయం : 5
- అవమానం : 1
గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు సువర్ణమూర్తిగా తదుపరి 18.10.2025 వరకు రజితమూర్తిగా తదుపరి 05.12.2025 వరకు సువర్ణమూర్తిగా ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారము.
శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు జన్మయందు సువర్ణమూర్తిగా సంచారము. రాహు కేతువులు: 18.05.2025 వరకు తామ్రమూర్తులుగా తదుపరి ఉగాది వరకు సువర్ణమూర్తులుగా సంచారము.
ఈ రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం వలన ప్రతి విషయంలో అనేక విధములుగా సమస్యలు ఉన్నవి. రైతు సోదరులు పంటలు ముహూర్త బలంతో తప్పక ఆచరించగలరు. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు బ్యాలన్స్‌గా ఉంటుంది. లాయర్లు డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు సాఫీగా ఉండగలరు. రాజకీయ నాయకులు ప్రత్యేకంగా పూజలు చేయించుకొనవలెను. వెండి, బంగారం ఇనుము సిమెంట్ కంకర వారికి కొఇంత వరకు మెరుగ్గా ఉంటుంది. టింబర్ వస్త్ర కిరాణ ఫ్యాన్సీ రంగులు రసాయణముల వారికి సామాన్యము. డ్రైఫుడ్స్ అపరాలు వారికి అనుకూలం. ధాన్యం రైస్ మిల్లులు స్టాకులు పెట్టువారిపైన దాడులు జరుగును.
స్టాక్ బిల్లులు జాగ్రత్తగా చూసుకొనగలరు. కెమికల్ ఫార్మా మెడికల్ వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులపైన శత్రు పీడలు ఉండగలవు. కక్షలు మెండుగా ఉండగలవు. తొందరగా బయటకు తెలియదు. మనీ ట్రాన్స్ఫర్ చేయరాదు. చెక్కులు ఇవ్వండి. ఒకమాటలో చెప్పాలంటే అనుకుంటే గడ్డు రోజులుగా కనిపించగలవు. ప్రతిరోజు గండంగా కొంతమందికి ఉంటుంది. పరిస్థితులు అర్థం కావు. మీరు ఆలోచన చేయండి. మనిషిలో విరక్తి ఆలోచనలు రాగలవు. ఇంత గడ్డుకాలంగా పోల్సుకొనగలరు.
జాయింట్ వ్యాపారస్తులకు కొంతవరకు వ్యతిరేక భావములు కలుగును. విద్యార్థులకు అధిక మార్కులు శ్రద్ధ ఉన్న వారికి రాగలవు. ఆదాయ వ్యవహారంలందు శ్రద్ధ తీసుకొనగలరు. క్రీడారంగంలో ఉన్నవారికి కొంత గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నరోజులు ఆర్భాటములకు పెద్ద పీట వేస్తున్నారు. ఆగి ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబములో కలహములు రాగలవు. శుభకార్యములకు అధిక ధనము ఖర్చు చేయగలరు. ఎవరికి ఒకోసారి ఏమి అర్థం కాదు. ఇదేమి దైవమే ప్రజలపైన పరిహాసం చేయనుందా అనిపిస్తుంది.
ఇది అంతయు ఆర్భాట జీవితములు మనము ఎటు వెళుతున్నాము అని ఆగి ఆలోచన చేయండి. పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించండి. సాయినాథునికి ప్రత్యేక పూజలు ఉత్తరభాద్ర నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించండి. శనికి తైలాభిషేకం, ఎరుపు నువ్వులు కడిగి ఎండపోసినవి కిలోంబావు అష్టోత్తరములు శని పాదాల దగ్గర వేయగలరు. నలుపు వస్త్రం శనికి కప్పి తైలాభిషేకం రేవతి నక్షత్రం వారు చిటికెన వ్రేలుకు జాతి పచ్చ బంగారం ఉంగరం ధరించండి.
వేంకటేశ్వర స్వామి వారికి అలంకరణ చేయించి చక్కెర పొంగళి ప్రసాదములు నైవేద్యములు లేక తిరుమల దర్శనం ధ్యానం యోగ చేయుట వన మానసిక బాధలు నివారణ జరుగును. చాలా ధైర్యంగా ఉంటారు. అనారోగ్యం సమస్యలు శని బాధలు నివారఖు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు, దానాలు అవసరమున్నది. మహన్యాస రుద్రాభిషేకం కుభేర పాశుపతం లక్ష్మీగణపతి హోమం కమల పుష్పములతో సుదర్శన హోమం ఈశ్వరునికి జలాభిషేకం చేయించండి. ఈ సంవత్సరం తెలియకుండా జరిగిపోతుంది. అదృష్ట సంఖ్య 3.