ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే..ఒకరిపై ఒకరు గన్​తో కాల్పులు

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే..ఒకరిపై ఒకరు గన్​తో కాల్పులు

రూర్కీ:ఉత్తరాఖండ్​లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మధ్య ఏర్పడిన విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకరి ఆఫీస్​పై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. 

అనుచరులతో వెళ్లి వీరంగం సృష్టించారు. ఆపై ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇద్దరిపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్​లోని రూర్కీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్.. ఖాన్​పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ మధ్య మొదట్నుంచి తీవ్ర విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఛాంపియన్ తన అనుచరులతో వెళ్లి కుమార్ ఆఫీస్​పై రాళ్లు విసిరారు. 

అక్కడున్న కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారు. ఆఫీస్ బిల్డింగ్​పైకి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత ఖాన్ పూర్ ఎమ్మెల్యే  కుమార్ కూడా వెళ్లి ఛాంపియన్ ఆఫీస్​పై కాల్పులు జరిపారు.