మన ప్రభుత్వ ఉద్యోగులు : కొట్టుకున్న మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ శాఖ డీఈ

మన ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉన్నారు.. ఇదిగో ఇలా ఉన్నారు.. మీటింగ్ లో కొట్టుకుంటూ ఉన్నారు.. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. పిఠాపురం సమస్యలపై కౌన్సిల్ మీటింగ్ పెట్టారు అధికారులు. మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ శాఖ డీఈతోపాటు కౌన్సెలర్లు అందరూ హాజరయ్యారు.. ఆ తర్వాత మీటింగ్ హాలులోనే.. అందరి ముందు ఏం జరిగిందో తెలుసా

ALSO READ | విజయవాడలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి..

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డీఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 కౌన్సిల్ సమావేశాల్లో ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు గొడవలు పడటం చూశాం. కానీ.. తాజాగా పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్లు గొడవ పెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించుకుంటూ.. బూతులు తిట్టుకున్నారు. దీంతో కౌన్సిల్ సభ్యులు ముక్కున వేలేసుకున్నారు.

దాడి చేసుకున్న అధికారులు

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఊహించని ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారులు గొడవ పెట్టుకున్నారు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవాని శంకర్‌ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకరిపై ఒకరు దాడి..

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమయంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ.. డీఈ సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని అన్నారు. వెంటనే డీఈ భవాని శంకర్‌ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హద్దలు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్.. బయటకు పో అంటూ గద్దించారు. డీఈ భవాని శంకర్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా స్పందించారు. సహనం కోల్పోయిన కమిషనర్.. డీఈపై చేయి చేసుకున్నారు. డీఈ భవాని శంకర్‌ కూడా కమిషనర్‌ను కొట్టారు.ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు ఉండగానే అధికారులు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. .. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.