
పిట్లం, వెలుగు : పిట్లం లయన్స్ క్లబ్ సభ్యులు పరీక్షా ప్యాడ్స్, జామెట్రీ బాక్సులను మంగళవారం చిల్లర్గి, గోద్మెగాం హైస్కూళ్లలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కాశీరెడ్డి, దాత రాజ్ కుమార్ మాట్లాడుతూ చిల్లర్గిలో ఐదుగురు టాపర్స్‌కు సిల్వర్ మెడల్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ అధ్యక్షుడు డాక్టర్ కిషన్, సెక్రటరీ వేణుగోపాల్, కోశాధికారి బాలు, సభ్యులు లక్ష్మీనారాయణ, టీచర్లు పాల్గొన్నారు.