సీఎం కప్​ విజేతగా పిట్లం జట్టు

సీఎం కప్​ విజేతగా పిట్లం జట్టు

పిట్లం, వెలుగు: రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ కబాడ్డీ పోటీలో​ జిల్లా విజేతగా  పిట్లం జట్టు  నిలిచింది. బుధవారం కామారెడ్డి సరస్వతి శిశుమందిర్​ మైదానంలో జరిగిన ఫైనల్లో పిట్లం జట్టు తాడ్వాయి జట్టుపై మూడు పాయింట్ల తేడాతో గెలుపొందినట్లు పిట్లం హైస్కూల్​ ఫిజికల్​ డైరెక్టర్​ సంజీవులు తెలిపారు. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్​లో​ తాడ్వాయి జట్టుపై 19,16 పాయింట్ల తేడాతో గెలుపొందినట్లు చెప్పారు. పిట్లం జట్టును జిల్లా స్థాయిలో విజేతగా నిలిపినందుకు క్రీడాకారులను ఎంపీడీవో కమలాకర్, ఎంఈవో దేవీసింగ్ అభినందించారు.