ప్రతి మనిషి తన జీవితకాలంలో మూడు రకాల ఋణాలను తీర్చుకోవాలని పెద్దలు చెబుతారు. అవేంటంటే.... దేవతల ఋణం, గురువులు అంటే ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితృల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం... భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ( సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14వరకు) ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తాం. ఈ 15 రోజులు పెద్దలకు ప్రీతిపాత్రమైనవి. ఈ ఏడాది మహాలయ పక్షాలు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 14వ తేదీ వరకు ఉన్నాయి. ఈ పదిహేను రోజులపాటు పితృకార్యాలు నిర్వహిస్తారు .ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు వదలాలని పండితులు చెబుతున్నారు. కనుక ఎలాంటి శుభకార్యాలు చేయరు..పితృదేవతలను తలుచుకుంటారు...హిందువుల నమ్మకాల ప్రకారం, అరచేతిలో బొటనవేలు ఉన్న భాగాన్ని పితృ తీర్థం అంటారు. తర్పణ పదార్థాలను తీసుకున్న తర్వాత దక్షిణ దిశలో కూర్చోవాలి.
పూర్వీకులకు బొటన వేలి నుంచి నీటిని తర్పణం వదలాలి. ఇలా పూర్వీకులకు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు. పౌరాణిక గ్రంధాల ప్రకారం, బొటనవేలు ఉన్న అరచేతి భాగాన్ని పితృ తీర్థం అంటారు. కర్తలు ( తర్పణం విడిచేవారు) తమ చేతులలో నీరు, కుశ (దర్భ) , అక్షత, పుష్పాలు మరియు నల్ల నువ్వులు తీసుకోవాలి. పూర్వీకులను ధ్యానం చేసుకుంటూ దాహం తీర్చుకోండి అంటూ నీటిని వదలాలి. తూర్పు ముఖంగా పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారని వివరించారు. ఋషి తీర్థంలో .. ఉత్తర ముఖంగా పూర్వీకులకు నీరు మరియు అక్షతలను సమర్పించాలి. పూర్వీకులకు దక్షిణ ముఖంగా నీరు, నువ్వులు సమర్పిస్తారు.
కొంతమంది పితృ పక్షం ( సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14 వరకు) పూర్వీకులకు అత్యంత ముఖ్యమైన రోజులని పండితులు చెబుతున్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే మహాలయ పక్షాల్లో తర్పణాలు విడవాలంటున్నారు. అయితే ఇంట్లో గంగా జలం ఉంటే దానితో తర్పణాలు వదిలితే చాలా పవిత్రత ఉంటుందని చెపుతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో గంగా నదికి ఎంతో పవిత్రత ఉంది. పూర్వీకులకు సమర్పించే ల గంగాజలంలో ఆహారం కలిపి నైవైద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదిస్తారని నమ్ముతారు. పితృ పక్ష కాలంలో ఇంటి చుట్టూ గంగాజలం కూడా క్రమం తప్పకుండా చల్లాలని పండితులు సూచిస్తున్నారు