ఎల్కతుర్తి, వెలుగు: మెదక్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ -765 డీజీ) నిర్మాణంలో భాగంగా సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు 64 కిలోమీటర్లు నిర్మించే రహదారిని మరో మూడు కిలోమీటర్ల మేర పొడిగించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్ కోరారు. ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వరంగల్-జగిత్యాల ఎన్ హెచ్ 563 ఎల్కతుర్తిని కలుపుతూ ఉండేదని, ప్రస్తుతం నేషనల్ హైవే విస్తరణలో భాగంగా రూటు మార్చారని తెలిపారు.
ఎల్కతుర్తి నుంచి కాకుండా మూడు కిలోమీటర్ల దూరంలోని ఎస్సార్ యూనివర్శిటీ నుంచి హైవే వెళ్తున్నదని, (ఎన్ హెచ్ -765 డీజీ) ని ఎస్సార్ యూనివర్శిటీ వరకు పొడిగించి, ఎన్ ఎచ్ 563కి కలిపితే ఎల్కతుర్తి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శేషు, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, మాజీ సర్పంచ్ గుండా ప్రతాపరెడ్డి, తంగెడ మహేందర్, సాతూరి చంద్రమౌళి పాల్గొన్నారు.