టీమిండియా వెటరన్ ప్లేయర్, స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. పోటీ క్రికెట్‌లో 1000 వికెట్లు తీసి భారత గొప్ప బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సీనియర్ స్పిన్నర్.. అరుణా చల్ ప్రదేశ్ తో మూడు వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డును ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మెగా మైల్‌స్టోన్ - 1001* వికెట్లు పీసీ భాయ్" అంటూ పోస్ట్‌లో రాశారు.
2005 నుండి చావ్లా పోటీ క్రికెట్‌ను ఆడుతున్నాడు. గుజరాత్ కు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ ఫస్ట్-క్లాస్, లిస్ట్-A గేమ్‌లు ఆడాడు. మొత్తం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 445, లిస్ట్ ఏ క్రికెట్‌లో 254, టీ20 క్రికెట్‌లో 302 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చావ్లా ఖాతాలో 1001 వికెట్లు ఉన్నాయి. 2006లో ఇంగ్లాండ్ పై టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన చావ్లా జట్టులో పెద్దగా ప్రభావం చూపించలేదు. టీమిండియాలో చోటు కోల్పోయినా 17 ఏళ్లుగా తన క్రికెట్ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
Also Read :- సింపుల్గా ఉందనుకున్నారు కదా.. టీ షర్ట్ ధర తెలిస్తే షాకవుతారు
3 టెస్టుల్లో 7 వికెట్లు, 25 వన్డేల్లో 35 వికెట్లు తీసుకున్న చావ్లా.. 7 టీ20ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం చావ్లాకు మంచి రికార్డ్ ఉంది. 181 మ్యాచ్ ల్లో 179 వికెలు తీసి టాప్-5 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ఈ లెగ్ స్పిన్నర్ ఎక్కువ మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. 2023 లో జరిగిన ఐపీఎల్ లో చావ్లా 22 వికెట్లు తీసి ముంబై తరపున టాప్ బౌలర్ గా నిలిచాడు.
? ???? ????????? - 1001* Wickets for PC bhai! ?#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/sMLQlZME58
— Mumbai Indians (@mipaltan) November 27, 2023