జాతీయ పసుపు బోర్డు పనితీరు భేష్: కేంద్ర మంత్రి గోయల్‌‌

జాతీయ పసుపు బోర్డు పనితీరు భేష్: కేంద్ర మంత్రి గోయల్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో జరుగుతున్న దేశపు అతిపెద్ద స్టార్టప్‌‌  కాన్‌‌క్లేవ్, స్టార్టప్‌‌  మహాకుంభ్‌‌ 2025లో నేషనల్  టర్మరిక్  బోర్డు  పనితీరును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌‌  గోయల్‌‌ ప్రశంసించారు. రైతులకు మద్దతు ఇవ్వడం, పసుపు వ్యవస్థాపకతను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా జాతీయ పసుపు బోర్డు.. స్టార్టప్‌‌  మహాకుంభ్‌‌ లో 10 ఆశాజనక పసుపు ఆధారిత స్టార్టప్‌‌లను పరిచయం చేసింది.

ఈ స్టార్టప్‌‌లు అత్యాధునిక ఉత్పత్తులను ప్రదర్శించాయి. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌‌  పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శి భవానీశ్రీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతీయ పసుపును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌‌గా ఎదిగేలా చేసేందుకు ఇలాంటి వేదికలు అవసరమని పీయూష్‌‌ అభిప్రాయపడ్డారు.