స్టాక్ మార్కెట్ ఇక నుంచి పడుతుందా, పెరుగుతుందా.. కేంద్ర మంత్రి ఇచ్చిన క్లూ అదేనా..?

స్టాక్ మార్కెట్ ఇక నుంచి పడుతుందా, పెరుగుతుందా.. కేంద్ర మంత్రి ఇచ్చిన క్లూ అదేనా..?

స్టాక్ మార్కెట్ వరుసగా ఫాల్ అవుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. 2024 సెప్టెంబర్ నుంచి మొదలైన డౌన్ ఫాల్.. 2025 లో మరింత దారుణంగా కొనసాగుతోంది. ఫారెన్ ఇన్వెస్టర్లు (FII) ఇండియా నుంచి పెట్టుబడులను యూఎస్ తో పాటు ఇతర దేశాలకు తరలిస్తుండటంతో మార్కెట్ దారుణమైన నష్టాలకు లోనైంది.  కేవలం ఫిబ్రవరి నెలలోనే లక్ష కోట్ల రూపాయలను అమ్మేశారు. దీంతో ఇండియన్ కంపెనీలు నష్టపోతుండగా.. రిటైల్ ఇన్వె్స్టర్లు మార్కెట్లో ఉండాలా.. అమ్మేసి వెళ్లిపోవాలా అనే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లు ఇక నుంచైనా పెరుగుతాయా.. తగ్గుతాయా అనే డైలమాలో ఉన్న టైమ్ లో మార్కెట్ పై కేంద్ర మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ స్టాక్ మార్కెట్ ల షార్ట్ టర్మ్ ఫ్యూచర్ గురించి చెప్పకనే చెప్పారు. నిఫ్టీ-50 బెంచ్ మార్క్ డీసెంట్ వ్యాల్యువేషన్ కు వచ్చిందని, రీజనేబుల్ పొజిషన్ లో ఉందని అన్నారు. మ్యుచువల్ ఫండ్ అసోసియేషన్ (AMFI) సమావేశంలో మాట్లాడిన ఆయన.. నిఫ్టీ ప్రైస్ టు ఎర్నింగ్స్ (P/E) రేషియో 19 కి చేరుకుందని, ఇది చాలా డీసెంట్ వ్యాల్యుయేషన్ లో ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. 

ప్రపంచంలో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని, వచ్చే 22 ఏళ్లలో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పటికే చాలా పడిందని, మరి కొంత కరెక్షన్ వస్తే రావచ్చునని తెలిపారు. అయితే FII లు వరుసగా అమ్మకాలు జరుపడంతో అందరూ భయపడుతున్నారని, కానీ ఇండియన్ మార్కెట్ ను వాళ్లు శాసించలేరని అన్నారు. ఇండియన్ మార్కెట్లను డామినేట్ చేసేది ఇండియన్ ఇన్వెస్టర్లు, SIP (సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) పెట్టుబడులు, DII (డొమెస్టిక్ ఇన్వెస్టర్స్), రిటైల్ ఇన్వెస్టర్లేనని అన్నారు. 

భవిష్యత్తులో రిటైల్ ఇన్వెస్టర్లే స్టాక్ మార్కెటను శాసిస్తారని, ఇండియాలో స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ రోజు రోజుకూ పెరుగుతూ ఉందని తెలిపారు. ఇండియా భవిష్యత్తును మార్చేది డొమెస్టిక్ ఇన్వెస్టర్లేనని, ఫారెన్ ఇన్వెస్టర్లు కాదని అన్నారు. మార్కెట్లో వచ్చే వొలాటిలిటీని తగ్గించి చిన్న ఇన్వెస్టర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీలు మార్కెట్లను స్థిరంగా ఉంచుతున్నాయని,  FII ఎంతగా అమ్మకాలు జరిపినా మార్కెట్ ను స్టెబిలిటీగా ఉంచుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మ్యుచువల్ ఫండ్ రూ.70 లక్షల కోట్ల మార్కెట్ అని, త్వరలో రూ.100 లక్షల కోట్లకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మార్కెట్లో మరి కొంత కరెక్షన్ రావచ్చునని మంత్రి చెప్పడం ఆసక్తికర అంశం. అయితే కంపెనీలు మంచి వ్యాల్యుయేషన్ లో ఉన్నాయని, మార్కెట్ ను స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇది రైట్ టైమ్ అని మంత్రి చెప్పకనే చెప్పారు. ఇండియా గ్రోత్ స్టోరీలో ఇన్వెస్టర్లు పాల్గొనాలని, రాబోయే రోజుల్లో ఎకానమి మరింత దూసుకెళ్తుందని చెప్పడం పాజిటివ్ సైన్. అదే విధంగా మార్కెట్లకు మంచి టైమ్ రానుందని చెప్పడంతో త్వరలో మార్కెట్లకు బూస్ట్ ఇచ్చే న్యూస్ వస్తుందని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తు్న్నారు.