- రైతులను టీఆఎర్ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుంది
- బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారు
న్యూఢిల్లీ: తెలంగాణ రైతులను టీఆఎర్ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుందన్నారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్. మంగళవారం పీయూష్ గోయల్ తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీలో లేని సమయంలో తెలంగాణ మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు.
"తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం. గత రబీలో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం. ఇప్పటికే నాలుగు సార్తు గడువును పొడగించాం. ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రారైస్ ఇవ్వాల్సి ఉంది. తెలంగాణకు స్పెషల్ కేస్ కింద 20 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్ రైస్ కు అనుమతించాం. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ అబద్దాలు చెబుతుంది. ఖరీఫ్ ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామని ఎన్నోసార్లు చెప్పాం. ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే మూడు రెట్లు ఎక్కువ కొన్నాం. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. రైస్ తీసుకుంటామని చెప్పాం. భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది". అని తెలిపారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.
మరిన్ని వార్తల కోసం
తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు