E-commerce growth: ఈ-కామర్స్ బూమ్ వల్ల ప్రమాదమే: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

E-commerce growth: ఈ-కామర్స్ బూమ్ వల్ల ప్రమాదమే: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. గర్వపడాల్సినదానికంటే అందోళన కలిగించే అంశంగానే చూడాలన్నారు. ఇది ఉపాధి, వినియోగదారుల సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బుధవారం ఆగస్టు 21,2024న జరిగిన ఓ కార్యక్రమంలో గోయల్ పెరుగుతున్న ఈ కామర్స్ రంగం నుంచి ఉత్పన్నమయ్యే సామాజిక అడ్డంకులను ఎత్తిచూపారు. 

పదేళ్ల తర్వాత ఈ కామర్స్ వృద్ధిలో మా మార్కెట్ సగాన్ని ఆక్రమిస్తుంది.. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు.అది ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఈ కామర్స్ కు స్థానం ఉన్నప్పటికీ దాని ప్రభావాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఈ కామర్స్ సంస్థల ధరల వ్యూహాల గురించి కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థల దోపిడీ ధరల విధానం దేశానికి మంచిదికాదు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 

ఈ కామర్స్ ముఖ్యంగా అధిక విలువ, అధిక మార్జిన్ ఉత్పత్తులపై ఆధారపడే చిన్న చిల్లర వ్యాపారులను ప్రభావితం చేస్తుంన్నారు గోయల్.. ఈ కామర్స్ వేగంగా పెరగడం చిన్న చిల్లల వ్యాపారుల వ్యాపారాన్ని దెబ్బతీయడమే కాకుండా వారిని మార్కెట్ నుంచి తరిమికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.