న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలు ముగిసిన తరువాత కొత్తవి ఆపేయడానికి తయారీ కంపెనీలు ఒప్పుకున్నాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. బ్యాటరీ చార్జింగ్, వాటి మార్పిడి వంటి అంశాలపై చర్చలు జరిగాయని, కంపెనీలు తమకు నచ్చిన వ్యాపార విధానాలను ఎంచుకోవచ్చని చెప్పారు.
బ్యాటరీలను మార్చుకోవచ్చని లేదా సొంత బ్యాటరీలనే బిగించి అమ్మవచ్చని వివరించారు. గ్లోబల్ఈవీ కంపెనీలను మనదేశం రప్పించడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈవీ పాలసీని ప్రకటించింది. మనదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లతో ప్లాంటు పెట్టే కంపెనీలకు సుంకాల్లో రాయితీలను ఇస్తామని తెలిపింది. అంతేగాక ఫేమ్–2 పథకం కింద దేశవ్యాప్తంగా 10,763 చార్జింగ్ స్టేషన్లను నిర్మించనుంది.
ఎలక్ట్రిక్ త్రీవీలర్లను ప్రోత్సహించడానికి పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ప్రకటించింది. ఈవీలను వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైందని గోయల్ఈ సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. అందుకే కొత్త ఇన్సెంటివ్లూ కొత్త సబ్సిడీలూ అవసరం లేదని, ఇప్పుడున్న ప్రోత్సాహకాలు మరికొంతకాలం కొనసాగుతాయని వివరించారు.