కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ లో కలకలం రేపిన కాన్పూర్ పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో జీఎస్టీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో రూ.257 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతోపాటు కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన ఆస్తి పత్రాలను కూడా గుర్తించారు. భారీ ఎత్తన ట్యాక్స్ ను ఎగ్గొట్టిన పీయూష్ జైన్ ను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
కాగా, తనిఖీల్లో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బులను లెక్కించేందుకే దాదాపు నాల్రోజుల సమయం పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రూ.257 కోట్ల నగదును గుర్తించారు. దీంతో పాటు 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి ఆభరణాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం: