Pizza-3 The Mummy Review : భయపెడుతూ భావోద్వేగాలను చూపిస్తున్న..పిజ్జా-3 ది మమ్మీ రివ్యూ

Pizza-3 The Mummy Review :  భయపెడుతూ భావోద్వేగాలను చూపిస్తున్న..పిజ్జా-3 ది మమ్మీ రివ్యూ

టైటిల్: పిజ్జా-3 ది మమ్మీ
యాక్టర్స్ : అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ వెంకట్ తదితరులు
డైరెక్టర్ :‍ మోహన్ గోవింద్ 
మ్యూజిక్: అరుణ్ రాజ్ఎడిటర్‌: అశ్విన్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్
ప్రొడ్యూసర్: సీవీ కుమార్
ప్రొడక్షన్ హౌస్: తిరుకుమరన్ ఎంటర్టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: ఆగష్టు 18,2023

పిజ్జా సిరీస్‌లో మూడవ చిత్రం అయిన పిజ్జా 3: ది మమ్మీ తెలుగు వెర్షన్ ఇవాళ (ఆగస్టు18న) మోహన్ గోవింద్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు కీ రొల్స్ లో యాక్ట్ చేశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో డిటైల్ గా తెలుసుకుందాం. 

స్టోరీ:

హీరో నలన్ (అశ్విన్ కాకుమాను) ఒక రెస్టారెంట్ కి ఓనర్. హీరో నలన్, కాయల్ (పవిత్ర మరిముత్తు) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు.  కాయల్ ఒక యాప్ డెవలపర్, వీరిద్దరూ కలిసి ఆత్మలతో కమ్యూనికేట్ చేయగల యాప్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటారు.అలాగే వీరి పెళ్లి కోసం కాయలు అన్నయ్యని ఒప్పించడానికి ఇంటికి వెళ్తాడు. కానీ కాయల్ సోదరుడు ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారికి, నలన్ అంటే ఇష్టం ఉండదు. అలా అకస్మాత్తుగా, రెస్టారెంట్‌లో కొన్ని రహస్యమైన విషయాలు జరగడం ప్రారంభిస్తాయి.

నలన్ రెస్టారెంట్‌లో వింత సంఘటనలు జరగటం స్టార్ట్ అవుతాయి.అతని పరిచయస్థులు కొందరు అనుమానాస్పద మార్గాల్లో మరణిస్తారు. అయితే ఈ మరణాలకు దెయ్యంతో సంబంధం ఉంది. మరి ఆ ఆత్మ ఇంత మందిని చంపడానికి కారణం ఏమిటి? చివరకు ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. 

అలాగే హోటల్ వంటరూంలో ప్రతిరోజూ ఒక స్వీట్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వంటకాన్ని తయారు చేసింది నలన్ అని రెస్టారెంట్ వర్కర్స్ నమ్ముతారు. కానీ ఆ వంటకం గురించి ఎలాంటి ఆధారం లేని నలన్ వంటగదిలో ఒక దుష్టశక్తిని చూడటం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఇంట్రెస్టింగ్ థ్రిల్ తో సాగే కథలో.. సీన్ టూ సీన్ తరువాత ఏం జరిగింది? వంటగదిలో ఆత్మ ఎందుకు దాక్కుంటుంది? అనే ఉత్కంఠ తో మూవీ సాగుతుంది.ఇదే ‘పిజ్జా 3’ మూవీ కథ. 

‘పిజ్జా 3' ఎలా ఉంది?

ఎలాంటి అంచనాలు లేకుండా 2012లో రిలీజైన ‘పిజ్జా’ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. ఈ మూవీతో యాక్టర్ గా విజయ్ సేతుపతి, డైరెక్టర్ గా  కార్తీక్ సుబ్బరాజ్ చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అదే ఏడాది తర్వాత (2013) ‘పిజ్జా 2’ మూవీ వచ్చింది. అయితే ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో.. సెకండ్ పార్ట్ మాత్రం అంత పెద్ద హిట్ కాలేకపోయింది. ఇక పిజ్జా పార్ట్ 3 మూవీ దాదాపు పదేళ్ల తర్వాత వస్తుండటంతో ఆడియన్స్ లో బాగా అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా తెలుగులో విడుదలైంది.మంచి టాక్ తో థియేటర్లో రన్ అవుతుంది. 

పిజ్జా 3 మూవీ ఫస్ట్ ఆఫ్ లో మంచి క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. ఈజిప్షియన్ మమ్మీ బొమ్మను చిన్న సైజులో చూపించే సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇక ఒక కుటుంబంలో తండ్రి దగ్గర ఉన్న బేబీ డాల్ బొమ్మ...అతనికి తెలియకుండా రెస్టారెంట్‌ను రన్ చేస్తోన్న హీరో నలన్‌కి దగ్గరికి చేరుకుంటోంది. ఇక హోటల్ లో వర్క్ చేసేవారు ఆ బొమ్మను బయటికి తీసి పక్కన పెడతారు.అలా రాత్రి రెస్టారెంట్‌లో వింత శబ్దాలు వినిపిస్తాయి. మధ్యలో హారర్ సీన్స్ వస్తాయి. మరోవైపు నలన్ తనకు తెలిసిన వ్యక్తులు చనిపోయే సన్నివేశాలతో నడిపించాడు డైరెక్టర్. మూవీ ఫస్ట్ ఆఫ్ లోనే ఆడియన్స్ మైండ్ సెట్ ని మూవీలోకి తీసుకెళ్తాడు. 

ఇక  ఇంటర్వెల్ టైమ్‌లో దెయ్యాన్ని చూపించి కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో దెయ్యం ఎందుకు హత్యలు చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంతో హీరో నలన్‌కి ఉన్న లింకు ఒక చోట రివీల్ అవుతోంది. ఇంటర్వెల్ వరకు పెద్దగా రివీల్ చేయకుండా కథను రన్ చేసిన డైరెక్టర్..ఇక సెకండాఫ్ లో జరిగే స్టోరీ తో రన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మొత్తం కంటెంట్ ని దాచిపెట్టాడు. కానీ కథ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ..కథనంలో డైరెక్టర్ కొత్తగా తీయాలేకపోయాడు. ఇక ఇప్పటికే చాలా హార్రర్ ఫిలిమ్స్ చూసిన ఆడియన్స్ ఏం జరగబోతుందో..ముందే ఆలోచిస్తున్నారు..

దెయ్యాలు కూడా క్రిమినల్స్ పై  రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంటే, హీరో నలన ఇన్వొల్వెమెంట్ అవసరం ఎందుకు ఉంది?  జరిగే ఇన్సిడెంట్స్ కి నలన్ కి ఏమైనా రిలేషన్ ఉందా అనే ఆలోచనలో ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తాడు డైరెక్టర్. కానీ ఎటువంటి ట్విస్ట్స్, హాంటింగ్స్ లేకపోవడంతో.. ఆడియన్స్ కాస్తా డిసప్పాయింట్ అవుతారు.  

ఇక ఈ మూవీలో కొన్ని సీన్స్ కి లింక్ పెట్టకపోవడం వల్ల.. స్టోరీ అక్కడక్కడా తేలిపోయినట్లు తెలుస్తోంది. మెయిన్ గా  క్రికెట్ బాల్ తగిలి ఒక అమ్మాయి మెమరీ లాస్ అవ్వడం..250డిగ్రీల టెంపరేచర్ లో మనిషి చనిపోయినా శరీరంలో పెద్దగా మార్పు రాకపోవడం వంటి సీన్స్ లో కొంత లాజిక్ మిస్ అవుతుంది. డైరెక్టర్ ఇంకాస్త టెక్నికల్ గా థింక్ చేస్తే సినిమాకె హైలెట్ గా ఉండేది. ఇక ‘పిజ్జా’ అనే సిరీస్ లో వచ్చినా ఈ పిజ్జా 3 టైటిల్ కి  బదులుగా మరో టైటిల్ పెట్టుంటే ఇంకా బాగా ఉండేది. 

ప్లస్ పాయింట్లు:

సినిమా మొదటి సగం డీసెంట్‌గా, థ్రిల్లింగ్ సీన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్ వచ్చే వరకు ఆసక్తికరమైన అంశాలతో వేగం పెరిగింది. ఇక హోటల్ లో హీరో,అక్కడ వర్కర్స్ మధ్య  వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ సాగుతాయి. అలాగే ఫస్ట్ పార్ట్ లో హత్యలు జరగడం, దాని వెనుక వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీకే హైలెట్ గా ఉంది. అశ్విన్ కాకుమాను మూవీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు.కొన్ని ఎమోషన్ సీన్స్ లో చాలా చక్కటి యాక్టింగ్ కనబరిచాడు. హీరోయిన్ గా పవిత్రా మరిముత్తు తన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ చక్కగా చేసింది. పోలీసుగా యాక్ట్ చేసిన గౌరవ్ డీసెంట్ యాక్టింగ్ కనబరిచాడు.

మైనస్ పాయింట్లు:

ఫస్ట్ పార్ట్ చాలా ఇంటెన్సివ్ గా , సెకండ్ పార్ట్ కాస్త డల్ గా సాగుతుంది. హర్రర్ సీన్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కారణంగా మొదటి సగం గుడ్ ఫీలింగ్ ను ఇస్తుంది. కానీ మూవీ మొత్తం ఇదే ఫీలింగ్ ను కంటిన్యూ చేయకపోవడం మైనస్ అని చెప్పుకోవాలి. 

పిజ్జా 3లో కూడా, ఒక కుటుంబం చంపబడుతుంది మరియు వారి ఆత్మలు తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాయి. కాబట్టి బ్యాక్‌స్టోరీ ప్రారంభమైన సన్నివేశం నుండి, చివరికి ఏమి జరుగుతుందో మనం సులభంగా ఊహించేలా ఉన్నాయి. ట్విస్ట్స్ లేకపోవడం, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కాస్త సాగదీయడం, రొటీన్ సెకండ్ హాఫ్, అతకని క్లైమాక్స్ ద్వారా డీసెంట్ హారర్ ఫిలిం గా పిజ్జా 3 నిలిచింది. 

టెక్నికల్ ఆస్పెక్ట్స్ :

టెక్నికల్ గా ఈ మూవీ చాలా బాగుంది. అందరూ చాలా థ్రిల్లింగ్ గా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అరుణ్ రాజ్ ఇంపాక్ట్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ఇంటెన్సివ్ గా ఉంది. ప్రభు రాఘవ్ కూల్ సినిమాటోగ్రఫీ చాలా క్లీన్ గా ఉంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తోన్నాయి. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్తా పని చెప్పి ఉంటే హైలెట్ స్క్రీన్ ప్రెసెంటేషన్ ఉండేది. ఇక డైరెక్టర్  మోహన్ గోవింద్ పిజ్జా 3 లో వర్క్ చేయటంతో..ఈ మూవీకి పిజ్జా 3 టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ లో తీసుకొచ్చిన థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ చివరి వరకి కంటిన్యూ చేయలేకపోయాడు. 

ఓవరాల్ గా: 

పిజ్జా 3: ది మమ్మీ అనేది కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్‌లను కలిగి ఉండే రెగ్యులర్ రివెంజ్ డ్రామా. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి, కానీ చివరి భాగంలో రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ తో ఆడియన్స్ డిస్సపాయింట్ అయ్యేలా ఉంది. హీరో అశ్విన్ కాకుమాను, హీరోయిన్ పవిత్ర మరిముత్తు, ఇతర యాక్టర్స్ బాగా యాక్ట్ చేసారు.ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.

భయంకర భావోద్వేగాలు చూపిస్తున్న పిజ్జా-3 మూవీ.