ఓ పిజ్జా డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ చేశాడు. అందుకు కస్టమర్ 2 డాలర్ల టిప్ ఇచ్చాడు. కట్ చేస్తే డెలివరీ బాయ్ లైఫే మారిపోయింది. ఒక్క దెబ్బకు సెటిలై పోయాడు. అంతటి అదృష్టవంతుడు ఎవరా.. అని సోషల్ మీడియా తెగ వెతుకుతున్నారు. దీంతో ఈ డెలివరీ బాయ్ స్టోరీ వైరల్ అయిపోయింది.
యూఎస్ లోని ఇండియానా స్టేట్ లో కన్నర్ స్టెఫనాఫ్ అనే వ్యక్తి రాక్ స్టార్ పిజ్జా కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. బ్రౌన్స్ బర్గ్ లోని ఒక ఫ్యామిలీ పిజ్జా ఆర్డర్ చేయడంతో తన డ్యూటీలో భాగంగా పిజ్జా ఇచ్చేందుకు బయలుదేరాడు. అయితే అక్కడ ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. కుప్పలు తెప్పలుగా మంచు పేరుకుపోవడంతో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ట్రాఫిక్ జామ్ ఒక్కటే కాదు.. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉందంటా ఆ టైమ్ లో. ఆ పరిస్థితుల్లో ఎవరూ బయటకు రాని పరిస్థితి. వాతావరణం ఘోరంగా ఉండటంతో ఎవరూ బయటికి రావద్దని ఆర్డర్స్ పాస్ చేసిందట ప్రభుత్వం.
స్టెఫనాఫ్ మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ.. పిజ్జా డెలివరీ చేయడానికి బయల్దేరాడు. ఏదైతే అదైంది.. ఇచ్చిన పని చేయడం మన బాధ్యత అనుకొని బయల్దేరాడట. కొంత దూరం వెళ్లే సరికి మంచు కుప్పల్లో బైక్ వెళ్లే పరిస్థితి లేదట. దానికితోడు యాక్సిడెంట్.. ట్రాఫిక్.. ఈ టైమ్ లో ఎవరైనా ఏం చెప్తారు.. సర్.. మేడం.. వెదర్ బాలేదు.. ట్రాఫిక్ జామ్ అయ్యింది.. రాలేను.. అని చెప్తారు కదా.. కానీ మనోడు అవేమీ చెప్పకుండా.. వెళ్లి ఫుడ్ డెలివరీ చేశాడట.
స్టెఫనాఫ్ డెలివరీ చేయడానికి వెళ్తుంటే ఎవాన్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన లెఫ్ట్‌నెంట్ రిచర్డ్ క్రైగ్ గమనిస్తూ ఉన్నాడట. ‘‘నరకంలో నడుచుకుంటూ వెళ్లి పిజ్జా డెలివరీ చేశావు కదా.. ఏమైనా టిప్ ఇచ్చారా’’ అని అడిగాడట స్టెఫనాఫ్ ని. ‘‘ఇచ్చారు సర్.. 2 డాలర్లు’’ అంటే.. ‘‘సరిపోతుందా మరి.. నీవు సాటిస్ఫై అయ్యావా’’ అని అడిగితే.. ‘‘చాలు సర్ వచ్చినంత తీసుకోవడమే’’ అన్నాడట.
స్టెఫనాఫ్ సిన్సియారిటీ.. క్యారెక్టర్ క్రైగ్ కు బాగా నచ్చిందట. ఇంత సిన్సియర్ అయిన ఇతనికి ఏదైనా చేయాలని అనుకున్నాడట. తన వద్ద ఉన్న 15 డాలర్లు ఇచ్చాడు. కానీ మనసు సంతృప్తి చెందలేదు. ఇది సరిపోదు.. ఇంకేమైనా చేయాలి అతనికి అని.. ‘‘గో ఫండ్ మి (GoFundMe)” అనే పేజ్ ను డెలివరీ బాయ్ కోసం ఓపెన్ చేశాడు. తక్కువలో తక్కువ 500 డాలర్లైనా రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ స్టెఫనాఫ్ సిన్సియారిటీ మెచ్చీ.. పేజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 17 జనవరికి 12 వేల డాలర్లు పోగవ్వగా.. 18 జనవరికి 16 వేల డాలర్లు ఫండ్ రైజ్ అయ్యింది. అంటే దాదాపు 13 లక్షలపైనే. దీంతో స్టెఫనాఫ్ జీవితమే మారిపోయిందట.
ఇది మీరు ఊహించారా అన్న ప్రశ్నకు స్టెఫనాఫ్.. ‘‘ఇది నిజంగా నిజమేనా కాదా అని నమ్మలేకపోతున్నా.. కానీ నిజం’’ అన్నాడు. స్టెఫనాఫ్ కు వచ్చిన రివార్డ్ గురించి రాక్ స్టార్ పిజ్జా మేనేజర్ ను అడగగా.. అతడు‘‘ రెస్టారెంట్ లో లేడు.. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిపోయాడు.. ఎవరు చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా అలాంటి కండిషన్ లో చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి పిజ్జా డెలివరీ చేశాడు. అతని డెడికేషనే అతన్ని ఈ రోజు అదృష్టంలా వరించింది”అని చెప్పాడు.
అయితే స్టెఫనాఫ్ సిన్సియారిటీ గురించి లెఫ్ట్‌నెంట్ క్రైగ్ బయటపెట్టక పోతుంటే.. అతడు ఒక సాధారణ డెలివరీ బాయ్ లాగే ఉంటుండే. ఆ ఆర్డర్ తర్వతా మరో ఆర్డర్ తీసుకొని తన డ్యూటీ చేస్తుండే. అంతకు మించి ఏం జరిగేది కాదు. కానీ క్రైగ్ చేసిన గొప్ప పని వల్ల ఇప్పుడు స్టెఫనాఫ్ లైఫ్ సెటిల్ అయ్యింది. అతని నిజాయితీ సమాజానికి తెలిసింది.