నేడు పీకేఎల్‌‌ ఎలిమినేటర్స్‌‌..యూపీతో జైపూర్‌‌‌‌, పట్నాతో ముంబా ఢీ

నేడు పీకేఎల్‌‌ ఎలిమినేటర్స్‌‌..యూపీతో జైపూర్‌‌‌‌, పట్నాతో ముంబా ఢీ

పుణె : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌‌ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో సత్తా చాటి టాప్‌‌–6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌‌ సమరానికి రెడీ అయ్యాయి. గురువారం జరిగే ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌ల్లో యూపీ యోధాస్‌‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌‌, పట్నా పైరేట్స్‌‌తో యు ముంబా తలపడనున్నాయి. యువ బలంతో సత్తా చాటుతున్న యూపీ ప్లేఆఫ్స్‌‌కు వచ్చింది. అదే జోరుతో  మూడో టైటిల్ వేటలో నిలిచిన జైపూర్‌‌‌‌ను పడగొట్టి ముందంజ వేయాలని చూస్తోంది.

ఇక,  చివరి లీగ్ పోరులో బెంగాల్‌‌పై ఉత్కంఠ విజయం సాధించి యు ముంబా ముందుకొచ్చింది. తమకంటే బలమైన పట్నా పైరేట్స్‌‌తో ఆ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.  ఎలిమినేటర్స్‌‌లో గెలిచిన జట్లు సెమీఫైనల్‌‌కు చేరుకుంటాయి. లీగ్ దశలో టాప్‌‌–2లో ప్లేస్‌‌లో నిలవడం ద్వారా టేబుల్ టాపర్‌‌‌‌ హర్యానా స్టీలర్స్‌‌, వరుసగా 15 మ్యాచ్‌‌ల్లో అజేయంగా ఉన్న దబాంగ్ ఢిల్లీ కేసీ నేరుగా సెమీఫైనల్‌‌కు అర్హత సాధించాయి.