
గ్రేటర్ నోయిడా: హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 28–31తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో పోరాడి ఓడింది. జెయింట్స్ తరఫున పర్తీక్ దహియా (11), గుమన్ సింగ్ (5) రాణించారు. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ (15), ఆశీష్ నర్వాల్ (7) ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. 13 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది ఐదో ఓటమి. అనతంరం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 43–30తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది.