పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ ముంగిట తెలుగు టైటాన్స్ తడబడింది. లీగ్‌లో పదో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 41–-37తో టైటాన్స్‌ను ఓడించింది.
పట్నా పైరేట్స్ తరఫున స్టార్ రైడర్ దేవాంక్ (14పాయింట్లు) సూపర్ టెన్ తో సత్తా చాటాడు. టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ (8), విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 60–29తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది.