16 వేల అడుగుల ఎత్తులో ... విమానం రెక్క ఊడింది..

అల‌స్కా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737- మ్యాక్స్ విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా అత్యవ‌స‌ర ప‌రిస్థితి ఏర్పడింది. స‌డెన్‌గా ఓ డోర్ ఊడిపోయింది. దీంతో ప్రయాణీకులు భ‌య‌బ్రాంతుల‌కు గురైయ్యారు. వెంట‌నే అప్రమ‌త్తం అయిన పైల‌ట్లు విమానాన్ని అత్యవ‌స‌రంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ లో చోటు చేసుకుంది.

అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కిటికీ 16 వేల అడుగుల ఎత్తులో అకస్మాత్తుగా ఊడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు హతశులయ్యారు. ఈ ఘటనతో విమానాన్ని పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో ప్లైట్‌లో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఊడిన డోర్‌ దగ్గర ప్రయాణికుల సీట్లు ఉండడంతో వారి చేతులలోని ఫోన్లు బయటకు ఎగిరిపోయాయి. 

అలాస్కా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఎక్స్‌లో పోస్టు పెట్టింది ‘ పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియో బయలుదేరిన  విమానానికి కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దాంతో తిరిగి విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేశాం.. ప్రమాద సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన విచారణ చేస్తున్నాం’ అని తెలిపింది. అలాగే ఈ సంఘటనపై యూఎస్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌( NTSB) కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు ప్రస్తుతం వైర‌ల్‌గా మారాయి. ఎగ్జిట్ డోర్ గాల్లో ఎగిరిపోవ‌డాన్ని ప్రయాణీకులు వీడియోలు తీశారు. ఈ వీడియోల్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు క‌నిపిస్తోంది. ఆ స‌మ‌యంలో ప్రయాణికుల చేతుల్లో ఉన్న ఫోన్లు గాలిలో ఎగిరిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గురైన బోయింగ్ 737 MAX అక్టోబరు 1, 2023న అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయబడింది. నవంబర్ 11, 2023 నుంచి కమర్షియల్ సర్వీసుల్ని అందిస్తోంది. అప్పటి నుంచి 145 సార్లు మాత్రమే ప్రయాణించినట్లు ఫ్లైట్‌రాడార్ 24 తెలిపింది. ఇప్పటికే బోయింగ్ సంస్థకు చెందిన 737- MAX విమానాల్లోని రడ్డర్‌లో లూస్ బోల్డ్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో 737 మాక్స్ ఇలా ప్రమాదానికి గురవ్వడంతో బోయింగ్‌కి కొంత ఇబ్బందిగా మారింది.

చ‌నిపోతాం అనుకున్నాం..

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై 22 ఏళ్ల ప్రయాణికుడు న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడాడు. ఇది ఎంతో భ‌యాన‌క అనుభ‌వం అని చెప్పాడు. ఇది ఓ పీడ‌క‌ల‌గా మిగిలిపోతుంద‌న్నాడు. ఆ స‌మ‌యంలో తాను చ‌నిపోతాన‌ని అనుకున్నట్లు తెలిపాడు.