
- అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్టులో ఘటన
డెన్వర్: అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 172 మంది ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందితో అప్పుడే ల్యాండ్ అయిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ ఫ్లైట్‌కు మంటలు అంటుకు న్నాయి. ఫ్లైట్ చుట్టూ దట్టమైన పొగలు ఎగసిపడుతుండగా, ప్యాసింజర్లను ఫ్లైట్ రెక్క మీది నుంచి స్లైడ్స్ ద్వారా కిందకు దించారు. మరోపక్క ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విమానం నుంచి దిగుతుండగా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఇంజన్ లోంచి వైబ్రైషన్స్ వస్తున్నట్లు పైలట్ గమనించి, డెన్వర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు. ఆపై కొద్దిసేపటికే ఇంజన్‌కు మంటలు అంటుకున్నాయన్నారు.