నేపాల్లో విమానం మిస్సింగ్

నేపాల్ లో తారా ఎయిర్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ తీసుకున్న ఫ్లైట్.. కొద్ది సేపటికే రాడార్ నుంచి మిస్ అయింది. ఈ చిన్న విమానం పొఖారా నుంచి జోమ్ సొమ్ వెళ్తుండగా మధ్యలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఫ్లైట్ లో మొత్తం సిబ్బంది సహా 22 మంది ఉన్నారు. ఇందులో నలుగురు భారతీయులు ముగ్గురు జపాన్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు. మిస్ అయిన ఫ్లైట్ సెర్చింగ్ కోసం రెండు ప్రైవేట్ హెలికాప్టర్లను నేపాల్ ఆర్మీ రంగంలోకి దింపింది. 

మరిన్ని వార్తల కోసం

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

బిహార్ లో భారీ గోల్డ్ మైన్