కెనడాలో పల్టీ కొట్టిన విమానం.. ల్యాండింగ్ సమయంలో తిరగబడిన డెల్టా ఎయిర్ లైన్స్

కెనడాలో పల్టీ కొట్టిన విమానం.. ల్యాండింగ్ సమయంలో తిరగబడిన డెల్టా ఎయిర్ లైన్స్

అమెరికాలో వరుస ప్రమాదాలు మరువక ముందే.. కెనడాలో మరో విమానం ప్రమాదం జరిగింది. తాజాగా కెనడాలో 80 మందితో కూడిన డెల్టా ఎయిర్ లైన్స్ 4819 ల్యాండింగ్ సమయంలో పల్టీలు కొట్టడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని మినియాపొలిస్ నుంచి బయల్దేరిన విమానం కెనడాలోని  ఒంటారియో టొరంటో ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో విమానం పూర్తిగా తిరగబడటం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది.

కెనడా కాలమానం ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా గాయపడ్డారు.  అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

ALSO READ | ప్రపంచ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యమా.. ఇలా అనిపించడానికి కారణాలు ఇవే..

టొరంటో ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ అవుతుండగా.. రన్ వే మీద విపరీతమైన మంచు ఉండడంతో విమానం స్కిడ్ అయింది. వేగంతో ల్యాండ్ అయిన విమానం వేగంగా వెళ్ళి కాపేటికి బోర్లా పడిపోయింది. ఎయిర్ పోర్టు సిబ్బంధి సహాయక చర్యలు చేపట్టారు.

టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత మైనస్‌ 8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయిందని అధికారులు చెప్పారు. 

ఈ విమాన ప్రమాదంతో దాదాపు 200 ప్లైట్లను రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది.

ఇటీవలే నార్త్ అమెరికా వాషింగ్ టన్ లో యూఎస్ ఆర్మీ హెలికాప్టర్, ప్యాసింజర్ ప్లేన్ పరస్పరం ఢీకొట్టడంతో 67 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా విమానం పల్టీ కొట్టిన ప్రమాదం సంభవించడంతో గమనార్హం.