జూన్​ 3న ఆకాశంలో అద్భుతం... అది ఏంటంటే..

జూన్​ 3న ఆకాశంలో అద్భుతం... అది ఏంటంటే..

ఆకాశంలో ఒకే రేఖలో ఆరు గ్రహాలు ప్రకాశించే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జూన్ 3న ఉత్తర అర్ధగోళంలో సూర్యోదయానికి ముందు బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే రేఖలో ప్రకాశించనున్నాయి. ఇది అరుదైన ఖగోళ దృగ్విషయమని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలనుకునేవారు జూన్ 3న సూర్యోదయానికి ముందే నిద్రలేచి గ్రహాలను చూడండి. 

జూన్ 3న ఆకాశంలో  అద్భుతం జరగబోతోంది. సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ ఒకే కక్ష్యలోకి వచ్చి పోలీసుల తరహాలో పేరేడ్ చేయబోతున్నాయి. ఈ దృశ్యం ఈ వేకువజామున సూర్యోదయానికి ముందు  3 గంటల నుంచి 6 గంటల వరకు ఆవిష్కృతం కాబోతోంది. బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు  ఒకే సరళ రేఖలోకి వచ్చి కనువిందు చేయబోతున్నాయి. యురేనస్‌, నెప్ట్యూన్‌ గ్రహాలు మాత్రం శక్తివంతమైన బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌తో చూస్తేనే కనిపిస్తాయి. మిగతా నాలుగు గ్రహాలైన బుధుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలను నేరుగా కళ్లతోనే చూడొచ్చు. ఈ దృశ్యం చివరిగా 2004లో కనువిందు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించనుంది. దీన్నే పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని పిలుస్తారు. . . గ్రహాల పేరేడ్ మళ్లీ 2492  మే 6 వ తేదీన  వస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిని శాస్త్రవేత్తలు పేరేడ్ ఆఫ్ ప్లానెట్ పేరుతో పిలుస్తారు. 

'ప్లానెటరీ పేరేడ్' అనే అధికారిక పేరు లేనప్పటికీ, సౌర వ్యవస్థలోని గ్రహాలు ఆకాశంలోని ఒకే ప్రాంతంలో వరుసలో ఉన్నప్పుడు జరిగే ఖగోళ సంఘటనను సూచించడానికి ఖగోళ శాస్త్రంలో ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనికి ఒకే నిర్వచనం లేదు. ఇవి సాధారణంగా ఉపయోగించే మూడు రకాలుగా చెబుతారు. మన సౌర వ్యవస్థ సూర్యునికి ఒక వైపు వరుసలో గ్రహాలు ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన ఇది. సౌర వ్యవస్థ గ్రహాలు భూమి నుంచి పరిశీలిస్తే ఆకాశంలోని ఒక చిన్న విభాగంలో సంభవించే సంఘటన. ఈ రకమైన గ్రహాల పేరేడ్ గతంలో ఏప్రిల్ 18, 2002న జరిగింది. ఆపై జులై 4, 2020న, కంటికి కనిపించే విధంగా సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఆకాశంలో వరుసగా ఉంటాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇటువంటి గ్రహాల కవాతులు 2040, 2492, 2854 సంవత్సరాల్లో జరుగుతాయి.  అరుదైన సందర్భాలలో సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలను ఒకే రాత్రిలో చూడగలిగే అద్భుతమైన సంఘటన ఇది. ఈ సంఘటనలను గ్రహాల పేరేడ్ అని కూడా అంటారు.

ప్లానెట్ పేరేడ్ లో రకాలు 

ప్లానెట్ పేరేడ్‌ను 'అప్పల్స్' అని కూడా పిలుస్తారు. పేరేడ్ లో పాల్గొనే గ్రహాల సంఖ్యను బట్టి వీటిని విభజిస్తారు.  

  • మినీ ప్లానెట్ పేరేడ్ - 3 గ్రహాలు 
  • స్మాల్ ప్లానెట్ పేరేడ్ - 4 గ్రహాలు
  • లార్జ్ ప్లానెట్ పేరేడ్ - 5 లేదా 6 గ్రహాలు
  • గొప్ప (పూర్తి) గ్రహాల కవాతు - సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు (+ ప్లూటో కొన్నిసార్లు)


మినీ ప్లానెట్ పేరేడ్ అరుదైన సంఘటనలు కాదు. మూడు గ్రహాలను ఏకకాలంలో ఒక ఏడాదిలో అనేక సార్లు గమనించవచ్చు.