ప్రతి సంవత్సరం కార్ల ధరలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. కొత్త కారు కొనాలనుకునేవారికి గతంలో కంటే రానున్న రోజుల్లో చాలా కష్టంగా మారింది. సొంత కారు కొనుక్కొని ఫ్యామిలీలో షికారు కొట్టాలనేకునేవారికి ఇది కష్టకాలమే అవుతుంది. అయితే ఇలాంటి వారికోసం గుడ్ న్యూస్.. తక్షణమే పైసా ఖర్చు లేకుండా తనకు నచ్చిన కారు ను కొనుగోలు చేసేందుకు కొన్ని బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. జీరో డైన్ పేమెంట్ కార్ లోన్లు అందిస్తున్నాయి. కోరుకున్న కారును ఆన్ రోడ్ ధరలో 100 శాతం కవర్ చేస్తున్నాయి.
మీరు కారు కొనుగోలు చేసే ముందు వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, కార్ లోన్లకు సంబం ధించిన ఇతర ఛార్జీలు వంటి అవగాహన, పూర్తి సమాచారం తెలుసుకోవడం అవసరం. దీంతో కొత్తకారు ఆర్థిక భారం కాకుండా చూసుకోవచ్చు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పటికే హౌసింగ్ లోన్ తీసుకునేవారికి, కార్పొరేట్ జీతం ఖాతాదారులకు 0.25% వడ్డీ రేటు రాయితీని అందిస్తోంది. అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లతో రుణగ్రహీతలకు 0.50శాతం వడ్డీ రేటు రాయితీని అందిస్తుంది. అయితే 750-799 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి 0.25% రాయితీని అందిస్తుంది. అదనంగా PSB అప్నా వాహన్ సుగమ్ కోసం ప్రాసెసింగ్ ఫీజుపై 50శాతం వరకు రాయితీ ఉంది.
బ్యాంకులు -వడ్డీరేట్లు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :8.70 శాతం
కెనరా బ్యాంక్ :8.70-12.70 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 8.70-13.00శాతం,
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.75-10.60 శాతం,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:8.75-9.80శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్: 8.75 శాతం,
IDBI బ్యాంక్: 8.80-9.60శాతం,
బ్యాంక్ ఆఫ్ బరోడా: 8.85-2.70 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా :8.85-10.85శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 8.85-12.00శాతం
ఫెడరల్ బ్యాంక్ :8.85 శాతం
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్:8.85-10.25శాతం
కర్ణాటక బ్యాంక్: 8.88-11.37శాతం
ICICI బ్యాంక్: 9.10శాతం
HDFC బ్యాంక్: 9.20శాతం
IDFC ఫస్ట్ బ్యాంక్: 9.75 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్:14.45-14.95శాతం వడ్డీరేట్లను అందిస్తున్నాయి.
కారు లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు
- కారులోన్ వడ్డీ రేట్లు అనేక అంశాలచే ప్రభావితమవుతాయి.
- ఉద్యోగులు, వ్యాపారులు వంటి అధిక ఆదాయం కలిగి ఉన్న వారికి బ్యాంకులు తక్కువవడ్డీ రేట్లు
- లోన్ పదవీకాలం రేట్లను ప్రభావితం చేస్తుంది
- ఎక్కువ రిస్క్ కారణంగా ఎక్కువ వడ్డీని కలిగి ఉంటుంది.
- దీర్ఘకాల క్లయింట్‌గా ఉంటే తక్కువ వడ్డీరేట్లు అందుబాటులో ఉంటాయి.
- బ్యాంకులు పాత మోడల్ కార్లకంటే కొత్త మోడల్ కార్లకు తక్కువ వడ్డీరేట్లు అందిస్తున్నాయి.
- పనిచేేసే కంపెనీ కూడా లోన్ వడ్డీరేట్లను ప్రభావితం చేస్తుంది. పేరున్న కంపెనీ అయితే తక్కువ వడ్డీరేటు
- ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తూ కూడా తక్కువ వడ్డీరేట్లు
కాబట్టి కార్లు కొనాలనుకునే వారు వీటన్నిటిని ఒకసారి రివ్యూ చేసుకొని కారు కొనుగోలు వెళితే మీకు ఆర్థికంగా భారం తగ్గించుకోవచ్చు.