ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు : వినోద్ కుమార్​

ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు

రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్​

చొప్పదండి, వెలుగు : రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ‘‘ఇంకా ఏడాది టైముందని అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో ఏడెనిమిది నెలల్లోనే గ్రామాల్లో రాజకీయ వేడి పుడుతుంది. అంతకుముందే తెలంగాణలో రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై చర్చ పెట్టాలి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట్ల రైతుబంధు, రైతు బీమా పథకాలు ఉన్నాయా అని నిలదీయాలి’’ అని అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమేం చేశామో, చేస్తున్నామో ప్రజలకు చెప్పాలని సూచించారు.

దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఒక్క ఫ్యాక్టరీని కూడా తేలేకపోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వడ్ల దిగుబడి 195 శాతం పెరిగిందని, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని విమర్శించారని, దేశంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని, ఈ పార్టీలను దగ్గరికి రానీయవద్దని ప్రజలను కోరారు.