
హుస్నాబాద్, వెలుగు : దేశంలో దివ్యాంగులకు అండగా ఉంటూ ఆదుకుంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. దేశంలో దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4016 పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇంత పింఛన్ ఇవ్వడంలేదన్నారు.
ఇది సీఎం కేసీఆర్‌కు దివ్యాంగులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే ఇలాంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, నాయకులు శీలం రాజిరెడ్డి, మేడబోయిన వెంకటేశ్, నవీన్‌రెడ్డి, సరిత, ఆవుల పద్మ, రాజు, సంపత్, రాజశేఖర్ రెడ్డి, సమ్మయ్య, లింగయ్య, కనకయ్య, శ్రీనివాస్, భిక్షపతి, సత్తయ్య పాల్గొన్నారు.