బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారు :  వినోద్ కుమార్ 

బాగా పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. తనపై గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క రూపాయన్న తెచ్చి అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. రైతుల కోసం దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశామలం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కారు కిరాయి పెట్టి ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను తిప్పి చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్టంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటూ సవాల్ విసిరారు. రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్టంలోనూ లేవన్నారు. నుస్తులాపూర్ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో వినోద్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.